హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
బచ్చల మల్లి కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?
డైరెక్టర్ సుబ్బు ఈ కథ చెప్పినప్పుడు సింగల్ సిట్టింగ్ లోనే ఓకే అయింది. కథ అంత అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఇందులో హాస్యరసం తప్పా అన్ని వేరియేషన్స్ వున్నాయి. నాంది తర్వాత డిఫరెంట్ సినిమాలని చేద్దామనుకున్నాను. అలా మంచి కంటెంట్ సినిమాల కోసం చూస్తున్న టైంలో ఈ సినిమా వచ్చింది. నిర్మాత రాజేష్ కి కూడా చాలా నచ్చింది. ఆయన చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అలా ఈ ప్రాజెక్టు మొదలైంది.
బచ్చలమల్లి క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా వుంటుంది ?
గమ్యంలో గాలి శీను ఎలా గుర్తుండిపోయాడో బచ్చల మళ్ళీ కూడా ఓ పదేళ్ళ పాటు గుర్తుండిపోతాడు. క్యారెక్టర్ ఇంపాక్ట్ అలా ఉంటుంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేశాను.
ఇది ఆటో బయోగ్రఫీ కాదు. డైరెక్టర్ సుబ్బు ఊర్లో బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆయన ఊర్లో గొడవలను కూడా తన గొడవలుగా ఫీల్ అయ్యే మనిషి. ఆయన జీవితంలోని మూడు ఇన్సిడెంట్ తీసుకొని కంప్లీట్ గా ఒక డిఫరెంట్ సబ్జెక్టు చెప్పడం జరిగింది.
బచ్చల మల్లి చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. ప్రతి మనిషిలోనూ బచ్చలమల్లి లాంటి క్యారెక్టర్ ఉంటుంది. మనకు తెలియకుండానే జీవితంలో కొన్ని నిర్ణయాలు మూర్ఖత్వంతో తీసుకుంటాం. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది. ఇందులో తెలియకుండానే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది.
ఈ సినిమాలో మీకు మోస్ట్ చాలెంజింగ్ పార్ట్ ఏంటి ?
మా డైరెక్టర్ గారు నడకలో కూడా ఒక మూర్ఖత్వం చూపించాలి అని అడిగారు. కాస్త కొత్తగా ఏడవండి అని చెప్పేవారు( నవ్వుతూ). ప్రతిదీ కొత్తగా చేయాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నా గత సినిమాల బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా కనిపించకూడదని చాలా జాగ్రత్తగా పడ్డారు. ఈ సినిమా చూసిన ఐదు నిమిషాల తర్వాత అల్లరి నరేష్ ని మర్చిపోయి బచ్చల మల్లినే చూస్తారు.
లుక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
ఈ కథ 90లో జరుగుతుంది. బచ్చల మళ్ళీ చాలా రెస్టిక్ క్యారెక్టర్. తను ట్రాక్టర్ నడుపుతుంటాడు. తన బాడీ గురించి ఎక్కువ కేర్ తీసుకునే పర్సన్ కాదు. అలాంటి లుక్ ని తీసుకురావడం కోసం హెయిర్ కి కాస్త రెడ్డిష్ కలర్ ట్రై చేశాం.
క్యారెక్టర్ డ్రివెన్ సినిమాల్లో క్యారెక్టర్ కనెక్ట్ అయితేనే సినిమా కనెక్ట్ అవుతారు మరి ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
ఈ కథని చాలా నిజాయితీగా చెప్పాం. ఇందులో ప్రతి ఎలిమెంట్ ని చాలా నేచురల్ గా చూపించాం. ఒక ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు రియల్ గా కొట్టుకున్నట్లుగానే ఉంటుంది. సినిమాని చాలా రియలిస్టిక్ గా ప్రజెంట్ చేశాం.
ఇందులో హీరోకి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కదా.. మరి దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏమైనా ఉంటుందా?
వుంది. ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. నన్ను వద్దనుకుంటే నాకు ఎవరు వద్దు అనుకునే క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ తో డిస్కనెక్ట్ అయితే ఇంకా చాప్టర్ ని క్లోజ్ చేసే క్యారెక్టర్. ఇందులో యాక్షన్ కథకి తగ్గట్టుగానే ఉంటుంది.