Thursday, December 26, 2024

ప‌ది మంది రాకుంటే స‌ర్కారు కూలిపోతుందా..?

రాజీవ్ చేసిన చ‌ట్టాన్ని మావాళ్లే చంపేశారు
పార్టీ ఫిరాయింపులు ప్రొత్స‌హించారు
కొత్త‌గా చేరి మ‌మ్మ‌ల్ని అవ‌మానిస్తున్నారు
సీనియ‌ర్ నేత‌నైన న‌న్నే కాంగ్రెస్ పార్టీ చంపేసింది
ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఆవేద‌న

పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. అ చ‌ట్టం ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌ పార్టీ ఫిరాయింపుల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం సుస్థిరంగా ఉన్న‌ప్ప‌టికీ పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్న‌ట్టు జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాన‌ని అన్నారు.. మానసిక ఆవేదనలో ఉన్నాన‌ని, ఈ ఫిరాయింపులపై ఖర్గేకు లేఖ రాశాన‌ని తెలిపారు. . ఫిరాయింపుల చట్టం లొసుగులతో పార్టీ మారుతున్నార‌ని, అలాగే మ‌రి కొందరు అభివృద్ధి అనే నినాదంతో పార్టీ ఫిరాయించార‌న్నారు. . పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజీవ్ గాంధీ చట్టం తెచ్చార‌ని, ఇప్పుడు ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉందని, దీంతో ఫిరాయింపుల అవసరం లేదన్నారు జీవ‌న్ రెడ్డి. దురదృష్టవశాత్తు తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని సంతోషించాన‌ని అన్నారు.. ఎమ్మెల్యే ల చేరికలు ఎందుకు అనేది అర్థం కాని పరిస్థిత‌ని వాపోయారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అనే పరిస్థితి ఉంద‌ని అంటూ పార్టీకి నేను అంతే గౌరవం ఇచ్చాన‌న్నారు.

కొత్త‌గా చేరి అవ‌మానిస్తారా..?
పదేళ్లు బీఆర్ఎస్ దౌర్జన్యాలను ఎదుర్కొన్నాన‌ని, . మళ్లీ కాంగ్రెస్ ముసుగులో దౌర్జన్యం చేస్తామంటే మేము ఎలా సహించాల‌ని ప్ర‌శ్నించారు.. నామినేటెడ్ పదవులు, అధికారం చెలాయించాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యే లు చూస్తున్నార‌ని వ్యాఖ్య‌నించారు. ఇలాంటి సమయంలో మా పరిస్థితి ఏంటని అధినాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నించారు. పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి త‌మ‌పై పెత్తనం చేయాలని ఆదేశించార‌ని ఆరోపించారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు లేకుండా మా ప్రభుత్వం కొనసాగదా. రాహుల్ గాంధీ కోరుకున్న ప్రజాస్వామ్య విలువలు ఇవ్వేనా అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. పార్టీ ఫిరాయింపులపై పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చాలా అనుభవం ఉంద‌ని, . పార్టీ ఫిరాయింపుల క్రమబద్ధీకరణకు పోచారం సలహాలు ఇస్తార‌ని ఎద్డేవా చేశారు. అసలు పోచారం సలహాదారుడు ఏంటి? భట్టి సీఏల్పీ పదవి పోవడానికి పోచారం కారణం కాదా? అని ఆరోపించారు.

న‌న్ను చంపేశారు
గంగారెడ్డిని హత్యచేసిన సంతోష్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అని తాజాగా బిఆర్ ఎస్ ఎమ్మెల్యే చేరికతో సంతోష్ ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకున్నాడ‌న్నారు. . ఆదిపత్యపోరుతో గంగారెడ్డిని హత్యచేశార‌ని అన్నారు. గంగారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోటీలో ఉన్నార‌ని, అందుకే అత‌డి అడ్డును తొల‌గించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు డాక్టర్‌ సంజయ్ కుమార్ త‌న‌కు హత్యతో సంబంధం లేదు అంటున్నారని అన్నారు. సంజయ్ ఇంట్లోనే కాంగ్రెస్ పుడితే.. బీఆర్ఎస్‌ లోకి ఎందుకు పోయాడు? అని ప్ర‌శ్నించారు. చేరికలను నేను ముందే వ్యతిరేకించాన‌ని అయినా ఎవ‌రూ పట్టించుకోలేద‌ని అంటూ నిజ‌మైన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌గా ఎన్నోఏళ్లుగా సేవ చేస్తున్న త‌న‌ను ఆ పార్టీనే చంపేసింద‌ని జీవ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com