భారత్ తో ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. భారత్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రపంచానికి చెబుతోంది. వాస్తవంలో మాత్రం జరిగేదంతా వేరు. సరిహద్దుల్లోని జనావాసాలు, ఆలయాలు, గురుద్వారాలను ఎక్కువగా టార్గెట్ పెట్టుకుంటున్నారు పాక్ బలగాలు. పాక్ చేస్తున్న ఈ బుకాయింపులను ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. జమ్మూలోని శంభూ దేవాలయంపై పాకిస్థాన్ జరిపిన దాడి వివరాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.
ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. పాక్ బాంబుల ధాటికి శంభూ ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని వీడియో ద్వారా బయటపెట్టింది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాక్ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్రం పేర్కొంది. శంభూ దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది.