‘అబీర్ గులాల్’ సినిమాపై కేంద్రం బ్యాన్
పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నటి వాణి కపూర్ తో కలిసి ‘అబీర్ గులాల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫవాద్ ఖాన్. అయితే, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ సినిమాను కేంద్రం బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్ నటులపై భారత్‌లో నిషేధం విధించినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్‌లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘటన అనంతరం పాకిస్థాన్‌కి చెందిన నటులపై భారత ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తుంది.
గులాల్.. బ్రేక్
పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి వాణీకపూర్, పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అబీర్ గులాల్’. ఈ సినిమా మే 09న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇందులో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటిస్తుండడంతో మూవీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్‌కి చెందిన నటులపై భారత్‌లో నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేయగా.. తాజాగా వాటిని యూట్యూబ్‌లో నుంచి మేకర్స్ తొలగించారు.