Saturday, May 10, 2025

అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని

భారత్ దాడుల్లో ఇస్లామాబాద్ సర్వనాశనం

కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్‌ను పూర్తిగా నాశనం చేసేందుకు భారత్ సైనిక చర్యకు దిగింది. దీంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. భారత్ దెబ్బకు పాకిస్థాన్ చేతులు ఎత్తేసింది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ తుక్కుతుక్కు అయినట్టు సమాచారం. ఈ దాడులను తట్టుకోలేక భారత్‌ను ఎదుర్కోలేక పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ దేశం విడిచి పోరిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఆయనకు సహాయక సిబ్బంది హెల్ప్ చేస్తున్నట్టు పాకిస్థాన్ నుంచి వార్తలు వస్తున్నాయి. గురువారం జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్తాన్ చేసిన క్షిపణి, డ్రోన్ దాడులను భారతదేశం భగ్నం చేసింది. దీని తరువాత, భారతదేశం కూడా ప్రతీకారం తీర్చుకునేందుకు లాహోర్, కరాచీతో సహా అనేక ప్రదేశాలలో డ్రోన్ దాడులను నిర్వహించింది. భారతదేశ ప్రతీకార చర్యతో భయపడి పాక్‌ మరోసారి అబద్ధాలు చెప్పింది. ఇస్లామాబాద్‌లో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, పాకిస్తాన్ పఠాన్‌కోట్, జైసల్మేర్, శ్రీనగర్‌లపై దాడి చేసిందని ఆరోపిస్తూ భారత మీడియా ప్రచారం చేసిన నిరాధారమైన, బాధ్యతారహిత ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా తిరస్కరిస్తోందన్నారు. ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయంగా ప్రేరేపితమైనవిగా చెబుతోంది. పాకిస్తాన్‌ను కించపరిచే లక్ష్యంతో నిరాధారమైన ప్రచార చేస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భారతదేశాన్ని ఒప్పించి సంయమనం పాటించేలా సలహా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఎటువంటి విశ్వసనీయ దర్యాప్తు లేకుండా పాకిస్తాన్‌పై పదేపదే ఆరోపణలు చేయడం దురాక్రమణకు ఒక సాకు మాత్రమేనని అంటోంది. తమ ప్రాంతాన్ని మరింత అస్థిరపరచడానికి ఉద్దేశపూర్వక వ్యూహాన్ని పన్నుతున్నట్టు ఆరోపిస్తోంది. ఇటువంటి చర్యలు శాంతికి, ముప్పు కలిగించడమే కాకుండా, రాజకీయ, సైనిక ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ఉపయోగించుకోవాలనే కోరికను కూడా ప్రతిబింబిస్తాయి అని ఏడుస్తోంది.

‘అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము’
ఈ ప్రమాదకరమైన ప్రవర్తనపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని, భారతదేశం సంయమనం పాటించి బాధ్యత వహించాలని కోరుతున్నామని పాకిస్తాన్ తెలిపింది. తప్పుడు సాకుతో ఏదైనా చేస్తే పూర్తి సన్నద్దతో ఎదుర్కోంటామని గాంభీర్యానికి పోతోంది. పాకిస్తాన్ అప్రమత్తంగా ఉందని, శాంతికి కట్టుబడి ఉందని, కానీ రెచ్చగొట్టడానికి, బెదిరించడానికి లేదా తప్పుదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలకు భయపడదని ఆయన అన్నారు. దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందించే హక్కు పాకిస్తాన్‌కు ఉందని ఈ ఆరోపణలను తీవ్రంగా తిరస్కరించామమన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com