Friday, May 9, 2025

Pakistani Pilot: భార‌త బ‌ల‌గాల‌ అదుపులో పాకిస్థాన్ పైల‌ట్‌

  • భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు
  • పాకిస్థాన్‌ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోన్న భార‌త సైన్యం 
  • ప‌ఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్ ప్రయోగించిన రెండు ఫైట‌ర్ జెట్లు నేలమట్టం
  • ఇందులో F-16 యుద్ధ విమానం పైల‌ట్‌ను అదుపులోకి తీసుకున్న భార‌త‌ ఆర్మీ

భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాయాది పాకిస్థాన్‌ దాడులను భార‌త సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ప‌ఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్ ప్రయోగించిన రెండు ఫైట‌ర్ జెట్ల‌ను సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా ఉంది. ఈ ఫైట‌ర్ జెట్‌ పైలట్‌ను భారత బ‌ల‌గాలు అదుపులోకి తీసుకున్నాయి.

 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయినా ఆ దేశం తన వక్రబుద్ధిని మార్చుకోకుండా… భారత్‌పైకి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా జమ్మూ, పఠాన్‌కోట్‌, ఉధంపూర్ సైనిక స్థావరాలపై దాయాది దేశం దాడులకు తెగబడిందని రక్షణశాఖ తెలిపింది. పాక్‌ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది.

 

పాక్‌ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేద‌ని స‌మాచారం. దాయాది పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది. అటు జ‌లంధ‌ర్‌లో పాకిస్థాన్ డ్రోన్ల‌ను భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com