ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆయన పలు సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత నుంచి ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాయి. చివరగా ఆయన రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియా లోనూ, పలు కార్యక్రమాల్లోనే కనిపిస్తూ ఉంటారు హరీష్. హరీష్ శంకర్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇప్పటికే పలు మార్లు ఈవెంట్ లలో ప్రెస్ మీట్ లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన హరీష్. ఇప్పుడు కూడా అలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో డ్రాగన్ సినిమా ఈవెంట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు తెలుగు సినిమాలు కాకుండా పక్క భాషల చిత్రాల్ని హిట్ చేస్తుంటారు అని అన్నారు. ఆ వ్యాఖ్యలతో హరీష్ శంకర్‌కు ఫుల్ డ్యామేజ్ జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అలానే తన స్టైల్ లో మాట్లాడి.. విమర్శల పాలవుతున్నారు. గత కొంతకాలంగా మలయాళం సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. నసీన్, మమితా కలిసి నటించిన “ప్రేమలు” చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ఆ మూవీ హీరో నస్లీన్.. మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యాడు. ఆయన నటించిన మలయాళ చిత్రం ‘అలప్పుజ జింఖానా’ మూవీ తెలుగులో ‘జింఖానా’ పేరుతో థియేటర్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే నిర్వహించిన ఈవెంట్ కి హరీష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పక్క సినిమాలను ఎంకరేజ్ చేయడం మనకు అలవాటే కదా, మన సినిమాలు మనం చూడకపోయినా కూడా పక్క సినిమాలని ఎగరేసుకుంటూ వెళ్లి చూస్తారు. తెలుగు సినిమాలు పట్టించుకోరు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.ఇకపోతే ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు హరీష్. ఇక నెటిసన్లు ఈ విషయంలో మరి నువ్వొచ్చింది కూడా అదే పక్క సినిమాని ఎంకరేజ్ చేయడానికే కదా అని కామెంట్లు పెడుతున్నారు.