-
ప్రభుత్వం భూమిలో తాటి వనం, ఈతవనం చెట్లు
-
పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
-
గౌడన్నల కోసం కాంగ్రెస్ కృషి
-
కాంగ్రెస్ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు నాగరాజు
ప్రభుత్వం భూమిలో తాటి వనం, ఈతవనం చెట్లు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కాంగ్రెస్ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారికి ప్రమాదం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. రోజు ఎక్కడో ఒక చోట గీత కార్మికులు చనిపోతున్నారని, ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వారి సమస్యలను రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి అధునాతన పరికరాలు తయారు చేసి గౌడన్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారన్నారు. గౌడన్నల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఈ సందర్భంగా కల్లు గీత కార్మికుల తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.