Thursday, December 12, 2024

సర్వేకు ససేమిరా..!

పంచాయతీ కార్యదర్శుల నిరసన
తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు..
నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్‌ ‌చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ప్రత్యేక యాప్‌ ‌విడుదల చేశారు. గృహాల మంజూరుకు సంబం ధించిన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. అయితే ప్రభుత్వానికి ఆదిలోనే పంచాయతీ కార్యదర్శుల నుంచి నిరసన మొదలైంది. తమకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ భారంగా మారిందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం మొదలు కావలసిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా వ్యాప్తంగా ఆగిపోయింది. ఈ విషయంలో మండల అభివృద్ధి అధికారులు కూడా సుముఖంగా లేరని తెలిసింది.

అప్లోడ్‌ ‌ప్రక్రియతోనే సమస్యలు..
గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. అందులో పలు అంశాలతో దరఖాస్తులు విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. అయితే అప్పటి ప్రజాపాలన దరఖాస్తుల అప్లోడ్‌ ‌కారణంగానే ఇబ్బందులు తలెత్తినట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించి యథాతథంగా కంప్యూటర్‌ ‌లో ఎంటర్‌ ‌చేయడంతో ప్రస్తుత సమస్య తలెత్తినట్లు తెలిసింది. గ్రామంలో 90 శాతం దరఖాస్తుదారులు తమకు ఇండ్లు లేవని దరఖాస్తు చేసుకున్నారు. ఇదే దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను సిద్ధం చేసింది. దీంతో ఒక్కో గ్రామానికి 600 నుంచి 1,500 మంది గృహ లబ్ధిదారుల పేర్లు అర్హులుగా నమోదయినట్లు తేలింది. కాగా గ్రామస్థాయిలో ఉండే పంచాయతీ కార్యదర్శికి ఇంత పెద్ద ఎత్తున ఇండ్లను యాప్‌లో అప్లోడ్‌ ‌చేయడం ఇబ్బందిగా పరిణమించింది. దీంతో లబ్ధిదారుల పేర్లను అప్లోడ్‌ ‌చేయడం తమకు భారంగా భావించి సర్వేను నిరాకరిస్తున్నట్లు తెలిసింది.

స్మార్ట్ ‌ఫోన్లలో అప్‌ ‌లోడ్‌ ‌ప్రక్రియ కూడా కష్టమే
స్మార్ట్ ‌ఫోన్లతో హౌసింగ్‌ ‌యాప్‌ ‌ను అప్లోడ్‌ ‌చేయడం కార్య దర్శులు తలనొప్పిగా భావిస్తున్నారు. సమయాభావంతో పాటు ఫోన్‌ ‌చార్జింగ్‌ ‌కూడా సరిపోదని చెబుతున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ‌సమస్య ఉత్పన్నమవుతుందని, దీంతో లబ్ధిదారులను ఎలా నిర్ధారించగలమని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ ‌సర్వీసులు పూర్తిస్థాయిలో లేకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. దాంతో ఉన్నతాధికారులు తమ సమస్యను అర్థం చేసుకొని ట్యాబ్‌లు ఇస్తే కొంతమేరకు ఫలితం ఉంటుందంటున్నారు.

– సర్వే బాధ్యతలను మరికొన్ని శాఖలకు అప్పగించాలి
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తమతోపాటు మిగతా శాఖలకు కూడా అప్పగించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. కుల గణన సర్వే మాదిరిగా మిగతా శాఖలను అనుసంధానం చేస్తే గృహ లబ్ధిదారుల అప్లోడ్‌ ‌ప్రక్రియ తొందరగా పూర్తవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు ఒక గ్రామంలో పని చేసే కార్యదర్శి మరో గ్రామంలో సర్వే చేసే విధంగా చర్యలు తీసు కుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొం టున్నారు.కాగా పంచాయతీ కార్యదర్శుల నిరసన నేపథ్యంలో ఉన్నతాధికారుల నిర్ణయం కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular