Saturday, January 11, 2025

పండుగ పూట విషాదం

నీటమునిగి ఐదుగురు మృతి

పండుగ వేళ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మర్కుర్‌ మండలం కొండపోచమ్మసాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. ముషీరాబాద్​కు చెందిన ఏడుగురు యువకులు డ్యాంలో ఈతకు వెళ్లారు. వీరిలో ఐదుగురు నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. జిల్లాలోని మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ముందుగా యువకులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు యువకుడు డ్యాంలో పడిపోగా.. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు గజ ఈతగాళ్లు.
మృతులు ధనుష్ (20), లోహిత్ (లక్కీ) (17), చీకట్ల దినేశ్వెర్ (17), సాహిల్ (19), జతిన్ (17)గా గుర్తించారు. అలాగే కొమరి మృగంక్ (17), ఎండీ ఇబ్రాహీం(20) సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి మృతి విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదా వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల శోకం వర్ణణాతీతం. యువకుల మృతి వార్త తెలిసి ముషీరాబాద్‌లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com