Wednesday, April 30, 2025

పని చేయమంటే చేయలేదు

అందుకే.. సస్పెండ్‌ చేస్తాం.. బీజేపీలో భూకంపం

తెలంగాణ బీజేపీ లీడర్లపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభ్యత్య నమోదుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని హెచ్చరించింది. ప్రతిఒక్కరి పనితీరుపై నివేదికలు తయారు చేసి, వెనకబడినవారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన మొదలైనట్లు తెలుస్తోంది. ప్రతి నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలు తయారు చేస్తుండగా వెనకబడిన వారిని సస్పెండ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సాల్, బీజేపీ ప్రజా ప్రతినిధులు, నేతల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోకల్ లీడర్లు సభ్యత్వాలకు సంబంధించి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని, ఏకంగా13 వేల ఫేక్ సభ్యత్వాలు ఇచ్చారని ఆగ్రహం సునీల్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారని, కేవలం వర్క్ షాప్‌లు, ఏసి రూముల్లో ఇండోర్ మీటింగ్‌లు పెట్టుకుంటే సరిపోదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడాలని, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు పెట్టాలని చెప్పారు. అలాగే జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు.. చలో బస్తీ, అంబేడ్కర్ జయంతి వేడుకలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటంలో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.

రాజీనామాకు సిద్ధంగా ఉండండి
పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. పార్టీ అగ్ర నాయకత్వం ప్రతి నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలు తయారు చేస్తోంది. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. పనితీరులో వెనుకబడిన వారిని సహించబోం. మే 4 నాటికి మండల స్థాయి కమిటీల ఏర్పాటును పూర్తి చేయడంలో విఫలమైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇక సభ్యత్వ నమోదు, కొత్త కార్యక్రమాల అమలుతో సహా కీలక లక్ష్యాలను సాధించడంలో నెమ్మదించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘పార్టీ 13,000 మంది క్రియాశీల సభ్యులను ఎంపికచేసింది. కానీ 4,000 మంది మాత్రమే నిజంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సభ్యత్వ డేటాలో చాలా వ్యత్యాసాలున్నాయి. బీజేపీ నియమాలు క్రియాశీల సభ్యులు.. ముందుగా ప్రాథమిక సభ్యులుగా ఉచితంగా నమోదు చేసుకోవాలి. ఆపై కనీసం 25 మంది కొత్త సభ్యులను నమోదు చేసుకోవాలి. అలాగే 100 మంది క్రియాశీల సభ్యత్వ రుసుము చెల్లించాలి. ఈ ప్రమాణాలను పాటించని దాదాపు 9,000 మంది వ్యక్తులను క్రియాశీల సభ్యులుగా లెక్కించబోమని బన్సాల్ స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com