నల్గొండ జిల్లా పంటపొలంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు దర్శమిచ్చాయి. పోలీసులకు సమాచారం అందించగా వాటిని పరిశీలించిన సీఐ వీరబాబు ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నకిలీ నోట్లుగా తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడేశారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిలో బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు కనిపించాయి. ఆ పక్కనే సంచి కూడా ఉండటంటో స్థానిక రైతులు అందులోనుంచి కొన్నింటిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే, అవన్నీ నకిలీవని తేలడంతో.. తిరిగి అక్కడే పడేశారు.
దామరచర్ల మండలంలో ఓ పొలంలో అచ్చుగుద్దినట్టుగా అసలు నోట్లను పోలిన నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు పడేసి ఉన్నాయి. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్న సంచి పడి ఉండటాన్ని స్థానిక రైతులు సోమవారం ఉదయం గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిగిలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించి ఉన్నట్టు గుర్తించారు. అవన్నీ నకిలీ నోట్లేనని, ఈ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాటిని ఎందుకు వినియోగిస్తున్నారనేది విచారణలో తేలుతుందన్నారు.