Friday, November 22, 2024

గాంధీ భవన్‌ ‌కు పటాన్‌ ‌చెరు పంచాయితీ

పటాన్‌ ‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌నాయకుల పంచాయితీ గాంధీభవన్‌ ‌కు చేరుకుంది. ఎంపీ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నుండి పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్‌ ‌రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన అనంతరం నుండి గ్రూపుల పంచాయతీ మొదలైంది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు, కాట శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్యే గూడెం వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం పటాన్‌ ‌చెరు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం, బొల్లారం, పటాన్‌ ‌చెరు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సీఐల బదిలీలు జరిగాయి. బదిలీ అయిన ముగ్గురు సీఐలు గూడెం మహిపాల్‌ ‌రెడ్డి మనుషులుగా పేర్కొంటూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులను తీవ్ర ఇబ్బందుల గురి చేసిన వారికి పోస్టింగులు ఇప్పించారు అంటూ ఇంచార్జి కాట శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుల బృందం గురువారం గాంధీభవన్‌ ‌లో నిరసన వ్యక్తం చేసింది. గత 20 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు చేస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలను నాయకులను వేధించిన పోలీసులను తిరిగి ఇలా పోస్టింగ్లు ఇస్తారంటూ పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీని నాశనం చేసేందుకే ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికిని కార్యకర్తలు ఇంకా వేధింపులు భరించాలా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి ఆగడాలను అరికట్టాలని ఫిర్యాదు చేశారు. బదిలీలను రద్దు చేయకపోతే కాంగ్రెస్‌ ‌పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో పటాన్‌ ‌చెరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular