Tuesday, March 11, 2025

కాంగ్రెస్ లోకి పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్

కాంగ్రెస్​లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​ కండువా కప్పుకోగా.. మరో ఎమ్మెల్యే కూడా చేరిపోయాడు. పఠాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి, బీఆర్​ఎస్​ నేత గాలి అనిల్​ కుమార్​సోమవారం సాయంత్రం కండువా కప్పి సీఎం రేవంత్​ పార్టీలోకి ఆహ్వానించారు.

గాలి అనిల్​కుమార్​ ప్రస్తుతం బీఆర్ఎస్​ నేత కాగా.. ఇటీవల పార్లమెంట్​ ఎన్నికల్లో జహీరాబాద్​ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లోకి పలువురు కార్పొరేటర్లు,అనుచరులు చేరిపోయారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com