Tuesday, May 13, 2025

పిఠాపురం నుంచి పోటీ.. ఆట మొదలు

 

  • పోటీ చేసే స్థానం ప్రకటించిన పవన్‌
  • ఎంపీగా పోటీ పై క్లారిటీ
  • ఏకపక్షమా హోరా హోరీనా
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. ఇక పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పటి వరకు అనేక పేర్లు వినిపించినప్పటికి చివరకు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు.

జనసేనాని పవన్ తాను పోటీ చేసే స్థానం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా స్వయంగా పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. ఎంపీగా పోటీ చేయటం పైన కూటమి పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. పోటీకి కారణాలను వివరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో.. ఈ సారి కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు పవన్ స్వయంగా తాను పోటీ చేస్తానని చెప్పారు. తాను 2019 ఎన్నికల్లో తాను తొలుత అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించానన్నారు. ఆ తరువాత భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రచారం ముగిసిన తరువాత తాను భీమవరం లో ఓడిపోతానని తెలిసిందని చెప్పుకొచ్చారు. అప్పుడే గాజువాక లోనూ ఓడిపోతానని తెలిసిందన్నారు.

హోరా హోరీనా…
2009 నుంచి పిఠాపురం లోనే తాను పోటీ చేయాలని సూచించారని…ఇప్పుడు పోటీకి దిగుతున్నానని స్పష్టం చేసారు. ప్రజారాజ్యం 2009లో పిఠాపురం సీటు గెలుచుకుంది. ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ప్రస్తుత వైసీపీ ఎంపీ వంగా గీత గెలిచారు. ఇప్పుడు వైసీపీ పిఠాపురం బాధ్యతలను వంగా గీతకు అప్పగించారు. గీత ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ సీటు ఆశిస్తున్నారు. కొద్ది రోజులుగా స్థానికులే ముద్దు వంట నినాదాలతో అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన సమయంలో వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వర్మ ఏకంగా 47 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌దే హవా గెలుపెవరిది ఇప్పుడు ఎన్నికల్లో వర్మ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.

ఇకపోతే పవన్‌ గతం మాదిరిగానే ఈసారి కూడా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? లేకపోతే కేంద్రంలోని పెద్దలు సూచించినట్లు ఒక అసెంబ్లీ ఒక లోక్‌సభకు పోటీ చేస్తారా? అనే అంశాలన్నిటికీ తెరపడింది. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. దాత్తాత్రేయులు అవతారం ఆయన తన గురువు శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థానం పిఠాపురం అని జనసేనాని ప్రకటించారు. అయితే తిరుపతి, భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఓట్లు చీల్చేందుకు ప్రయత్నించమని ఆయన తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నిల్లో పార్టీ కీ రోల్‌ పై కీలక వ్యాఖ్యలను చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com