ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు.