Monday, May 12, 2025

సినిమాల్లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

అభిమానుల సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ కాస్త.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిపోయారు. దీంతో పవన్ ఇకపై సినీమాల్లో  సినిమాల్లో నటిస్తారా? లేదా? అన్న సందేహం ఆయన అభిమానుల్లో కలుగుతూ వస్తోంది. ఇటివంటి సమయంలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో నటించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్పందించారు. ప్రస్తుతం మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌ లకు దూరంగా ఉంటానని చెప్పారు. ఐతే సమయం చిక్కినప్పుడు ఒకట్రెండు రోజులు సినిమా షూటింగ్‌కు కేటాయిస్తానని పవన్ కళ్యామ్ తెలిపారు.

బుధవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరడంతో ఈ మేరకు స్పందించారు పవన్. సినిమాలు చేసే టైమ్‌ ఉందంటారా.. కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా.. అందుకే ముందు చెప్పిన పని చేయాలి.. లేదంటే నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ‘ఓజీ’ చేస్తావా.. క్యాజీ అంటే నేనేం సమాధానం చెప్పాలి.. షూటింగ్‌ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానన్నా.. ‘ఓజీ’ సినిమా బాగుంటుంది.. అని చెప్పారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాల్లో నటించేందుకు కమిట్ మెంట్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కారణంగా ఆయా సినిమాల షూటింగ్‌స్ వాయిదా పడ్డాయి. ఈ మూడు సినిమాల కోసం పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లో నటిస్తానని పవన్‌ కళ్యామ్ స్వయంగా చెప్పడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com