ట్విట్టర్లో పవన్ కళ్యాణ్
భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం” గా మార్చడం సంతోషం.ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను.వందల ఏళ్ల పాటు ప్రాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ,భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీ విజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం.భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను.
![Pawan Kalyan welcomed the name change of Andaman and Nicobar Islands](https://i0.wp.com/tsnews.tv/wp-content/uploads/2024/09/pawan-kalyan.png?resize=696%2C434&ssl=1)