Wednesday, April 2, 2025

వెండి‘తెర’కెక్కరు…!

పవన్ కల్యాణ్ అభిమానులు ఇక ఆయన సినిమాలు చూడలేరు. పవన్ మేనియా ఇక కనిపించదు. 2024 ఎన్నికల్లో పవన్ గెలవడంతో పాటూ ఆంధ్రాలో కూటమి విజయం సాధించింది. దీంతో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. పదవిలో ఉండగా ఆయన సినిమాలను చేయడం కుదరదు. అందుకే ఇక మీదట పవన్ సినిమాలు చేయరని చెబుతున్నారు. అసలు పవన్ సినిమాలు చేయడం మానేస్తారని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇంతకు ముందు ఆయనే స్వయంగా చాలా సార్లు ఆ మాట కూడా అన్నారు. 2019 ఎన్నికలప్పుడూ సినిమాలకు టాటా బైబై అన్న పవన్ అప్పుడు ఓడిపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. డబ్బులు కావాలికాబట్టి సినిమాలు చేస్తాను అని చెప్పారు. అయితే ఈ ఐదేళ్ళల్లో కూడా పెద్దగా ఏమీ చేయలేదు. పట్టుమని ఐదు సినిమాలు కూడా రాలేదు.

ఓడిపోయినా పవన్ రాజకీయాలకు దూరంగా ఉండలేదు. జనాల్లో ఉంటూ తిరుగుతూ వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడ్డ తర్వాత అయితే సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. ఇప్పుడు అదే శాశ్వతం కానుంది. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కచ్చితంగా పవన్‌కు పెద్ద పదవే ఇస్తారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి కీలక పాత్ర పోషించిన జనసేనాని డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇక సినిమాల్లో నటించే ఛాన్సే ఉండదు. ప్రస్తుతం ఉన్న సినిమాలు త్వర త్వరగా కంప్లీట్ చేసుకుని పవన్ మూవీస్‌కు శాశ్వతంగా గుడ్‌ బై చెప్పేస్తారు.

ప్రస్తుతం పవన్ హరీష్ శంకర్ సినిమాతో పాటూ హరిహర వీరమల్లు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. హరీష్ శంకర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. హరిహరవీరమల్లు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. వీటి తర్వాత ఆయన కొత్త సినిమాలను ఏమీ ఒప్పుకోలేదు కూడా. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ తన మకాంను కూడా విజయవాడకు మార్చేయనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పవన్ ఆంధ్రాలో ఆల్మోస్ట్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే ఫ్యామిలీని కూడా విజయవాడకు మార్చేయనున్నారు. దీంతో ఆయన మొత్తంగా అసలు హైదరాబాద్‌కు, ఫిల్మ్ ఇండస్ట్రీకే దూరంగా కానున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం దీన్ని జీర్చించుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నా సినిమాలు మానేయకూడదని కోరుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com