Saturday, January 4, 2025

రాజకీయ కుట్రలో భాగంగానే హైడ్రాపై బిఆర్‌ఎస్, బిజెపి నాయకులది మొసలి కన్నీరు

  • ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలో అక్రమ నిర్మాణాలపై
  • హరీష్ రావు, ఈటల రాజేందర్‌ల వైఖరి స్పష్టం చేయాలి
  • పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్

రాజకీయ కుట్రలో భాగంగానే బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు హైడ్రాపై మొసలి కన్నీరు కారుస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలో అక్రమ నిర్మాణాలు, నాలాలు, మూసీ ప్రక్షాళనపై హరీష్ రావు, ఈటల రాజేందర్‌ల వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పులున్నాయని ఆయన తెలిపారు. దానిపై ఎవరు మాట్లాడినా కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ ప్రకారంగా ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్, రోడ్డు విస్తరణలో ప్రజా ప్రయోజనాల కోసం విధి, విధానాలు ఖరారు చేస్తూ జిఓ నెం 168 విడుదల చేశారని, దాని ప్రకారం ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలో ఎవరిదైనా పట్టా భూమి ఉన్నా ఎటువంటి నిర్మాణాలు చేయవద్దన్న నిబంధనలు ఉన్నాయని ఆయన తెలిపారు.

పట్టా భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వంలో ఉందన్నారు. అలాంటి వారికి గతంలో టిడిఆర్ బాండ్లు ఇచ్చారని, కొంతమంది ఆక్రమణదారులు, భూ బకాసురుల ధనదాహానికి చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే తెలిసీ తెలియక అందులోని ఇళ్లను కొనుగోలు చేశారన్నారు. అలా నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com