పిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి
ఎమ్మెల్యే హరీష్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, పదేళ్ల పాలనలో ప్రజలు చీదరించుకున్నారని పిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్తగూడెంలో రైతులకు బేడీలు వేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కెసిఆర్‌దని, ప్రజలకి సుపరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆగష్టు 15వ తేదీ వరకు 2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.