-
పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను కెసిఆర్ భ్రష్టు పట్టించారు
-
కేజీ నుంచి పిజి వరకు కెసిఆర్ అబద్దపు వాగ్దానాలు చేశారు
-
విద్యా వ్యవస్థను సిఎం రేవంత్ రెడ్డి సమూల మార్పులు చేస్తున్నారు
-
పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం
పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థను కెసిఆర్ భ్రష్టు పట్టించారని పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేజీ నుంచి పిజి వరకు కెసిఆర్ అబద్దపు వాగ్దానాలు చేశారని ఆయన ఆరోపించారు. విద్యా వ్యవస్థను సిఎం రేవంత్ రెడ్డి సమూల మార్పులు చేస్తూ విద్యా కమిషన్ వేస్తున్నారన్నారు. పిల్లల భవిషత్ మంచిగా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి ఎల్‌కేజి నుంచి పీజీ దాకా సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన అన్నారు. 11వేల టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ వేశారని, 38 వేల ఉపాధ్యాయ బదిలీలు, ప్రదోన్నతులను సిఎం కల్పించారన్నారు.
స్పోర్ట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీలను సిఎం ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటిఐలను టాటా సహకారంతో రూ.2500 కోట్లతో సిఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రపంచంలో సుందరమైన నగరంగా రూపుదిద్దుకోబోతుందని ఆయన జోస్యం చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు.