people appreciating for danakishore quick decision
పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్.. కొంత కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యకు ఇట్టే పరిష్కారాన్ని చూపెట్టారు. అధికారులు ఇలా ప్రో యాక్టివ్‌గా పని చేస్తే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది.
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే ప్రజలకు ఉపయోగ పడే నిర్ణయాలు తీసుకోవచ్చని నిరూపించారు. ఆదివారం కురిసిన భారీ వర్షాల సమయంలో మాదాపూర్ ప్రాంతంలో పర్యటించిన ఆయన, వరదలకు గురైన రహదారులపై పరిస్థితిని పరిశీలించారు.
మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్స్‌లో 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్‌ను నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.
సంపు, అనుబంధ డ్రెయిన్లకు సుమారు 13 కోట్ల వ్యయం అవుతుందని, వారం రోజుల్లో పనులు చేపట్టి నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటువంటి సంపుల నిర్మాణం కోసం ప్రభుత్వం 18 ప్రదేశాలను గుర్తించినట్లు దాన కిషోర్ తెలిపారు.