Tuesday, February 25, 2025

పీపుల్‌స్టార్‌గా సందీప్‌ కరెక్టేనా?

యువ హీరో సందీప్‌ కిషన్‌ సాఫ్ట్‌ హీరో. పెద్దగా కాంట్రవర్సీలు లేని హీరో అని చెప్పాలి. మరి సడెన్‌గా సందీప్‌ కాంట్రవర్సీలో పడ్డారు. అదేంటంటే సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రం నుంచి తన పేరుకు ముందు పీపుల్స్‌ స్టార్‌ను యాడ్‌ చేసుకున్నాడు. అయితే ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ‘మజాకా’ చిత్రం ప్రెస్‌మీట్‌లో పలువురు పాత్రికేయులు ప్రశ్నించారు. అయితే ఆర్‌.నారాయణమూర్తికి పీపుల్స్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఉన్న విషయమే తనకు తెలియదని సందీప్‌ సమాధానం చెప్పారు.
అంతేకాదు ఈ విషయంలో మేము ఆయనకు ఏం చేయాలో అది చేస్తాం. మేము ఆయన్ని కన్విన్స్ చేసుకుంటాం. మీకేంటి ప్రాబ్లెమ్‌? అనే రీతిలో అన్సర్‌ ఇచ్చాడు సందీప్. ఇక ‘మజాకా’ నిర్మాత అనిల్ సుంకర మాత్రం సందీప్‌ కిషన్‌ స్వభావం, ఆయన్ని ప్రజలు రిసీవ్‌ చేసుకుంటున్న తీరును బట్టి తానే ఆయనకు ఈ ట్యాగ్‌ను ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. సందీప్‌ తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆర్‌. నారాయణమూర్తి లాంటి నటుడికే పీపుల్స్‌ స్టార్‌ అనే పదం కరెక్ట్‌గా సరిపోతుందని, ఇప్పటికైనా సందీప్‌ ఈ విషయంలో రియలైజ్ అయ్యి తన నిర్ణయం మార్చుకోవాలని నారాయణమూర్తి అభిమానులు అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com