Friday, November 29, 2024

ఫార్మా సిటీకి బ్రేక్‌ లగచర్ల నుంచి సర్కారు వెనక్కి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. లగచర్లలో అధికారులపై దాడి వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. భూ సేకరణ కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడికి దిగారు. అయితే, ప్రస్తుతం ఫార్మా సిటీ నోటిఫికేషన్‌ ను రద్దు చేస్తూ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది,

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular