- న్యాయమూర్తికి ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధా కిషన్‌రావు విజ్ఞప్తి
- ఈ నెల 12 వరకు రిమాండ్
టీఎస్, న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్ల కోర్టు తెలిపింది. జైల్‌లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని ఈ సందర్భంగా కోర్టుకు రాధా కిషన్ తెలిపారు. జైల్ సూపరింటెండెంట్‌ను కూడా కలవనీయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. లైబ్రరీతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను కలిసేలా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్‌ను దాదాపు వారం రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ కాన్వెన్షన్ కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి Farmar Special Intelligence Branch (SIB) Chief Prabhakar Rao స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే నాలుగో రోజు కస్టడీలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించి ఆ తరువాత కోర్టులో హాజరుపర్చారు.