Thursday, May 8, 2025

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత విచ్ఛినం ఉగ్ర శిబిరాల శాటిలైట్‌ ఫొటోలు విడుదల

భారత్ దాడుల తరువాత ఉగ్రవాదుల శిబిరాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆపరేషన్ సిందూర్ తరువాత ఉగ్రవాదుల స్థావరాలు ఎలా మారాయో శాటిలైట్ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా చేపట్టగా.. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను నామరూపాల్లేకుండా చేసింది ఆర్మీ. ముఖ్యంగా ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న పాకిస్తాన్‌లోని బహవల్పూర్ టెర్రరిస్ట్ క్యాంప్, మురిద్కేలో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందుకు సంబంధించి శాటిలైట్ ఫొటోలు వచ్చాయి. మాక్సర్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆ ఉగ్రవాద స్థావరాల ప్రస్తుత ఫొటోలను రిలీజ్ చేశాయి. భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ తో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. మొత్తం 21 ఉగ్రస్థావరాల సమాచారం సేకరించిన భారత బలగాలు అందులో ముఖ్యమైన 9 ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసి విధ్వంసం చేశారు. బహవల్పూర్, మురిద్కేలో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ (జేఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కీలక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు దాడులు చేసి తిరిగొచ్చాయి. జేషే మహ్మద్ ప్రధాన కార్యాలయం అయిన బహవల్పూర్‌లోని స్థావరం దాడికి ముందు, దాడి తరువాత ఎలాం ఉందో శాటిలైట్ ఫొటోలు చూస్తే జరిగిన నష్టం అర్థమవుతుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని బహవల్పూర్‌లోని కరాచీ మోర్‌లోని బహవల్పూర్ శివార్లలో జాతీయ రహదారి-5 (కరాచీ-టోర్ఖం జాతీయ రహదారి)పై మర్కజ్ సుభాన్ అల్లా ఉంది. 15 ఎకరాల్లో జేఈఎం ఉగ్రవాద శిబిరం విస్తరించి ఉంది. యువతను ఉగ్రవాదంలోకి దింపి, వారి జీవితాలు నాశనం చేయడంతో పాటు ఎన్నోచోట్ల ఉగ్రదాడులు చేపించి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఫిబ్రవరి 14, 2019న పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడిని ప్లాన్ చేసిన ఉగ్రవాదులకు ఇది కేంద్రంగా పనిచేసిందని ఆరోపణలున్నాయి. మర్కజ్ జె.ఇ.ఎం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. పుల్వామా దాడికి పాల్పడిన వారికి ఈ శిబిరంలోనే శిక్షణ ఇచ్చారని అధికారులు తెలిపారు.

మురిడ్కే స్థావరం పరిస్థితి ఇలా..
అదేవిధంగా, లష్కరే తోయిబా కేంద్రమైన మురిడ్కే స్థావరం శాటిలైట్ ఫొటోలు దాడికి ముందు, తరువాత గమనిస్తే భారత బలగాల సక్సెస్ ఏంటన్నది అర్థమవుతోంది. భారత్ ఎయిర్ స్ట్రైక్స్ ముదు ఎన్నో భవనాలతో కూడిన విశాలమైన ఏరియా కనిపిస్తుంది. దాడుల తరువాత బిల్డింగ్స్ ధ్వంసం కావడంతో జరిగిన నష్టాన్ని శాటిలైట్ ఫొటోలలో గమనించవచ్చు. 2000లో స్థాపించిన ఉగ్రవాద స్థావరం మర్కజ్ తైబా పాకిస్తాన్‌ పంజాబ్‌లోని షేఖుపురాలోని మురిద్కే, నంగల్ సహదాన్‌లో ఉన్న ‘అల్మా మేటర్’. లష్కరే తోయిబాకు చెందిన అతి ముఖ్యమైన శిక్షణా శిబిరం ఇది. 82 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాంప్లెక్స్‌లో ఉగ్రవాద సంస్థలు, మార్కెట్ ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com