Wednesday, December 25, 2024

పిల్లి సంగతి సరే… నీకు ఇంత గ్యాప్‌ ఏంటమ్మా

సమంత టాలీవుడ్‌.. కోలీవుడ్‌.. బాలీవుడ్‌ ఇలా పరిచయం అవసరం లేని వ్యక్తి. భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. మరి అంతక్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ దాదాపు రెండు ఏళ్ళగా ఆమె నుంచి ఎటువంటి సినిమా రాకపోవడం పై అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. ఇటీవలే వరుణ్ ధావన్ తో నటించి సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ విడుదలై విజయవంతమైంది. అందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరో వెబ్ సిరీస్ చేసేందుకు సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది. దానిపేరు రక్తబ్రహ్మాండ అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. నాగచైతన్యకు విడాకులిచ్చేసిన తర్వాతే సమంత మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సమంత అనవసరంగా తొందరపడిందేమో.. అక్కినేని లాంటి కుటుంబంలోకి కోడలిగా వెళ్లి తిరిగి వచ్చేసిందంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వివరాలను తెలియజేస్తుంటుంది. తాను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, అందుకు సంబంధించిన ఫొటోలను అప్ డేట్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. గులాబీపువ్వు వాసన చూస్తున్న పిల్లి తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో తాను పెంచుకుంటున్న పిల్లి ఫొటోను షేర్ చేసింది. ఉదయం లేవగానే గులాబీ పువ్వు వాసనను అది ఆస్వాదిస్తోందని రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పిల్లి కూడా గులాబీపువ్వు వాసన చూస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి తన సొంత బ్యానరుపై తెలుగులో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా నిర్మిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. దీనితర్వాత తమిళంలో, హిందీలో రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తెలుస్తోందికానీ వాటిపై అధికారికంగా ప్రకటన లేదు. షారుక్ సరసన ఒకటి, తమిళంలో విజయ్ సరసన ఒకటి అనుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com