Saturday, September 14, 2024

రికార్డు సృష్టించిన భారత ప్రధాని మోదీ

* రికార్డు సృష్టించిన భారత ప్రధాని మోదీ
* 100 మిలియన్ల ఎక్స్ (ట్విట్టర్) ఫాలోవర్స్ 
భారత ప్రధాని మోదీకి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైరు పాలిటిక్స్, మరోవైపు సోషల్ మీడియా.. ఏదైనా తగ్గేదేలే అంటున్నారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ప్రధాని మోదీ టాప్ లో ఉంటూ వస్తున్నారు. ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని బాధ్యతలు స్వీకరించిన మోదీ, సోషల్ మీడియాలో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ (ట్విట్టర్) లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది.
వంద మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఎక్స్‌లో అత్యధికంగా అనుసరించే వరల్డ్ లీడర్ గా ప్రధాని మోడీ రికార్డు సృష్టించారు. పీఎం మోడీ X హ్యాండిల్ గత మూడేళ్లలో సుమారు 30 మిలియన్ల వినియోగదారులు ఫాలో అవుతున్నారు. దేశంలో మిగతా నాయకుల ఫాలోయింగ్ ను పరిశీలిస్తే.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి 26.4 మిలియన్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ కు 19.9 మిలియన్లు, పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీకి 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రపంచ నేతల్లో 38.1 మిలియన్ల మంది అనుచరులతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, దుబాయ్ పాలకుడు హెచ్‌హెచ్ షేక్ మహ్మద్ 11.2 మిలియన్లు, పోప్ ఫ్రాన్సిస్ 18.5 మిలియన్ల ఫాలోవర్స్ తో ప్రధాని మోదీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఏ దేశాధినేతకు లేనంత గా, భారత ప్రధాని మోదీ క్రేజ్ రోజురోజుకు పెరుగుతుండటం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular