Saturday, May 17, 2025

పోలవరం కథేంది..? తొలిసారి ప్రాజెక్టుపై సమీక్షించనున్న ప్రధాని మోదీ

ఏపీ జీవన రేఖగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష చేయనున్నారు. మే 28వ తేదీన మధ్యాహం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఒడిశా సీఎం లతో పాటు ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె.విజయానందకు తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం పాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించడం తెలిసిందే. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే అప్పగించాలని నీతి ఆయోగ్ గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.
2014-19 మధ్య కాలంలో ఎన్డీయే కూటమిగా ఉన్న ఏపీ ప్రభుత్వం పోలవరం పనులు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడూ ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో 72 శాతం వరకు పూర్తి చేయించారు. దయాఫ్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తిచేశారు. దానిపై ఎర్త్ కమ్ రాక్ఫెల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం వేసేస్తే, ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తయిపోయేవని అధికారులు తెలిపారు. కానీ తరువాత ఏపీలో ప్రభుత్వం మారడంతో పనులు మందగించాయని.. వైసీపీ హయాంలో జగన్ పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
కేంద్రం వద్దని చెప్పినా గత ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థను మార్చేసింది. ఫలితంగా 2020లో గోదావరికి వరద ఉదృతి పెరగడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దీంతో ప్రధాన డ్యాం పనులు నిలిచిపోయాయి. తరువాత ఏడాది పాటు పనులు జరగలేదు. గత ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనల కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ పోలరవం ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. అమెరికా, కెనడా నిపుణుల సూచన మేరకు కొత్త డయాఫ్రం వాల్, సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేయనున్నారు. 2027 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com