Monday, May 5, 2025

పోలవరం ప్రాజెక్టు లో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

పోలవరం ప్రాజెక్టు ను సోమవారం నుంచి అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇవ్వనుంది.

అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు.

వీరితో పాటుగా పి పి ఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు, సరబ్జిత్ సింగ్ భక్షి,రాకేష్ తోతేజ, అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సి ఎస్ ఎం ఆర్ ఎస్ అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్ట్ సి ఈ కే నరసింహ మూర్తి, ఎం ఈ ఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందం, అధికారులకు వివరించారు.

నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రం వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్టత పనులు పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com