Tuesday, May 13, 2025

విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై పోలీస్‌ ‌కేసు

అర్థరాత్రి దాటినా తెరవడంపై నమోదు

స్టార్‌ ‌బ్యాటర్‌ ‌విరాట్‌ ‌కోహ్లికి చెందిన పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా దానిని నిర్వహి స్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాట కలోని చిన్నస్వామి స్టేడియం సపంలో కోహ్లికి చెందిన వన్‌8 ‌కమ్యూన్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగి స్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాటినుంచి పెద్దశబ్దంతో సంగీతం విని పిస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

అర్ధరాత్రి ఒంటిగంట వరకే వాటికి అనుమతి ఉన్నప్పటికీ, ఆ తర్వాత కూడా నిర్వాహకులు వాటిని తెరిచే ఉంచినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ‘దీనిపై మేం దర్యాప్తు చేస్తున్నాం. బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకు ంటాం‘ అని వెల్లడించారు. ప్రస్తుతం వన్‌8 ‌కమ్యూన్‌ ‌మేనేజర్‌పై కేసు నమోదైంది.ఇతర మెట్రో సిటీలైన దిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతాలో కూడా వన్‌8 ‌కమ్యూన్‌ ‌బ్రాంచ్‌లు ఉన్నాయి. బెంగళూరు పబ్‌ను గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. కస్తూర్బారో డ్డులో ఉన్న దీని నుంచి సపంలో ఉన్న కబ్బన్‌ ‌పార్క్, ‌చిన్నస్వామి స్టేడియంలను వీక్షించొచ్చట.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com