Thursday, December 26, 2024

చిరంజీవీ బోళాశంక‌ర్ సినిమా విడుద‌లపై వివాదం

* నిర్మాత అనిల్ సుంక‌ర 28.32 కోట్లు చెల్లించాలి
* లేక‌పోతే నిబంధ‌న‌ల ప్ర‌కారం సినిమా విడుద‌ల చేయ‌కూడ‌దు
* త‌నకు ప్రాణ‌హానీ ఉంద‌ని పోలీసుకు ఫిర్యాదు
* హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌కు ఇచ్చిన లేఖ‌లో
గాయ‌త్రి దేవి ఫిలిమ్స్ బ‌త్తుల స‌త్యానారాయ‌ణ‌

 

మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్నా బాటియా హీరోహీరోయిన్లుగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న బోళాశంక‌ర్ సినిమా విడుద‌ల‌పై వివాదం ఏర్ప‌డింది. ఈ సినిమా విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని కోరుతూ గాయ‌త్రిదేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట‌ర్ బ‌త్తుల స‌త్యానారాయ‌ణ హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. 2023 మే2 న నిర్మాత‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం.. కొత్త సినిమాను విడుద‌ల చేసే ప‌దిహేను రోజుల ముందు ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంక‌ర త‌మ‌కు రూ.28.32 కోట్లు చెల్లించాలని తెలిపారు. కాక‌పోతే, ఈ నిబంధ‌న‌ను ప‌ట్టించుకోకుండా ఆగ‌స్టు 11న సినిమాను భోళాశంక‌ర్ సినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశార‌ని పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఇచ్చిన లేఖ‌లో వివ‌రించారు. అంతేకాకుండా, నిర్మాత మీద కేసు పెట్ట‌గానే త‌న‌కు అజ్ఞాత వ్య‌క్తుల నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని.. ముఖ్యంగా 9848055574 అనే నెంబ‌రుతో కాల్ చేసి.. కేసు వెన‌క్కి తీసుకోక‌పోతే త‌నతో పాటు త‌న కుటుంబ సభ్యుల్ని చంపేస్తామ‌ని బెదిరిస్తున్నాని ఫిర్యాదు చేశారు. ఈ నెంబ‌రు నుంచి ఫోన్ చేస్తున్న మొట్ట‌ప‌ర్తి వెంక‌టేశ్వ‌ర‌రావు నుంచి త‌న‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని బ‌త్తుల స‌త్యానారాయ‌ణ పోలీసుకిచ్చిన ఫిర్యాదులో వివ‌రించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com