Tuesday, January 7, 2025

పోలీస్ కొత్త లోగో

తెలంగాణలో మారిన గుర్తు
ఆమోదం వేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను టీజీ పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది. ఇప్పటికే రాష్ట్ర అధికారిక పేరుగా ఉన్న తెలంగాణ స్టేట్‌ను కేవలం తెలంగాణగా మారుస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమ సమయంలో ఉన్న టీజీ పేరును తిరిగి ఏర్పాటు తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలకు టీజీ పేరును చేర్చారు. ప్రభుత్వ కార్యాలయాలు తమ శాఖలకు ముందు ఉన్న టీఎస్ పేరును తొలగించి, టీజీగా మార్పులు చేశారు. వాహన రిజిస్ట్రేషన్లను కూడా టీజీ పేరుతో చేస్తున్నారు. కొత్తగా వాహనాలు రిజిస్ట్రేషన్ టీజీ పేరుతోనూ చేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. ఇష్టమైతే పాత వాహనాలు కూడా టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు.

పోలీస్‌.. నయా లోగో
ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త లోగోను డిజైన్ చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ లోగోను విడుదలచేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ ఖాతాలో న్యూ లోగోను పోస్ట్ చేసింది. గత లోగోలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ తొలగించి.. తెలంగాణ పోలీస్ అనే పేరుతో కొత్త లోగోను డిజైన్ చేశారు. గత లోగోలో కేవలం స్టేట్ అనే పదాన్ని తొలగించి కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించింది. ఆ ఒక్క మార్పు మినహా.. గతంలో ఉన్న లోగోనే విడుదల చేసింది. ఇక నుంచి పోలీస్ శాఖ అధికారిక చిహ్నం తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి తెలంగాణ పోలీస్ గా మారిందని పోలీసు శాఖ వెల్లడించింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com