Wednesday, April 16, 2025

పాటల చిత్రీకరణలో ” పోలీస్ వారి హెచ్చరిక “

నల్లపూసలు ఫేం ” బాబ్జీ” దర్శకత్వం లో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ” పోలీస్ వారి హెచ్చరిక ” చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ అరకులోయ, కాఫీ వనం, ఆపిల్ రిసార్ట్స్, వైజాగ్ యారాడా బీచ్, నకిరేకల్ లాండ్స్, యస్ స్టూడియో మొదలైన లొకేషన్లలో ఈ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని తెలిపారు.

గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్ ను స్వరపరచి సంచలనం సృష్టించి, రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు, పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన సంగీత దర్శకుడు “గజ్వేల్ వేణు” ను ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నామని దర్శకుడు బాబ్జీ తెలిపారు. చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే నల్గొండ లో క్లైమాక్స్సన్నివేశాలను చిత్రీకరించడం తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ” తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com