మన దేశ రాజకీయాలు.. చట్టాలు.. కొన్ని విచిత్రంగా ఉంటాయి. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరమయం అయిపోయాయని, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొంది. మాజీ, సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించడంతోపాటు, దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం నిన్న దీనిని విచారించింది.