Monday, September 30, 2024

విద్యుత్ కొనుగోళ్లపై రాజకీయ రగడ

  • కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో జరగాల్సిందే
  • ఆ ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేదు
  • ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్‌సి అనుమతి ఇవ్వలేదు
  • పర్యావరణ అంశాలను లెక్క చేయకుండా భద్రాది నిర్మాణం
  • జస్టిస్ సరసింహారెడ్డి విచారణ కమిషన్ ఎదుట తెలంగాణ జెఎసి ఛైర్మన్ రఘు
  • తప్పిదాలపై క్రిమినల్ చర్యలకూ వెనుకాడవద్దు: ప్రొఫెసర్ కోదండరాం
  • విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ

విద్యుత్ కొనుగోళ్లపై రాజకీయ రాగడ సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నేతల మధ్య కరంటు కొనుగోళ్ల వివాదం మాటల యుద్ధానికి కారణమవుతోంది. Justice Sarasimha Reddy Inquiry Commission పవర్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సిఎం కెసిఆర్‌కు విద్యుత్ కొనుగోలుపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయగా ఆయన బాధ్యతలనుంచి తప్పుకోవాలని లేఖ రాయడంతో అగ్గి రాజేసినట్లయ్యింది. భద్రా ద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బిఆర్‌కె భవన్‌లో కమిషన్ కార్యాలయానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. ఇద్దరి వద్ద కమిషన్ వివరాలను అడిగి తెలుసుకుంది.

విద్యుత్ ఒప్పందానికి ఈఆర్‌సి అనుమతి ఇవ్వలేదు:తెలంగాణ జెఎసి ఛైర్మన్ రఘు

ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని తెలంగాణ జెఎసి ఛైర్మన్ రఘు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్‌సి అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రొవిజన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రొవిజన్‌కు సవరణలు చేసి పంపాలని ఈఆర్‌సి సూచించిందని వివరించారు. ఏడేళ్లు గడిచినా గత ప్రభుత్వం సవరణలు చేయలేదని, అలాగే విద్యుత్ ఒప్పందం కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో జరగాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.

అలా కాకుండా ఎంఓయూ చేసుకున్నారని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.2,600 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌ఘడ్ విద్యుత్ సరఫరా చేయలేదని, వెయ్యి మెగా వాట్ల కోసం ఒప్పందం జరిగినా సరఫరా చేయలేదని, మరో 1000 అదనపు మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఒప్పందం జరిగిందన్నారు. తప్పు జరిగిందని తరువాత తెలిసిందని, రద్దు చేయడానికి వీలు పడలేదన్నారు. ఇరు రాష్ట్రాల డిస్కంల ద్వారా ఒప్పందాలు ఎంఓయు చేసుకున్నాయని, ఛత్తీస్‌ఘడ్ ఒప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో బీహెచ్‌ఈఎల్ 2013- 14లో 88శాతం రేటింగ్ ఉండే తరువాత జీరోకు పడిపోయిందని, బీహెచ్‌ఈఎల్ కాంపిటేటివ్ బిడ్డింగ్‌పై కాగ్ రిపోర్టులు ఇచ్చిందని తేల్చిచెప్పారు.

సమాచారం కమిషన్‌కు ఇచ్చాం Chhattisgarh Power contracts

ఛత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు ఇచ్చామని, కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చామని రఘు స్పష్టం చేశారు. భద్రాద్రి థర్మల్ పాలట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదని, ఇండియా బుల్స్ కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషనరీ రూపొందించారన్నారు. ఇండియా బుల్స్‌తో ఒప్పందం రద్దు కావడంతో సబ్ క్రిటికల్ మిషనరీ నెలకొల్పారని, దాంతో జరిగే నష్టాన్ని 25 ఏళ్లపాటు భరించాల్సి ఉంటుందన్నారు.

గోదావరిలో వరదలు ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరమైన అంశాలను దృష్టిలోకి తీసుకోకుండా భద్రాది నిర్మాణం చేయడం సరికాదని, సాంకేతిక పరమైన అంశాలను దృష్టిలోకి తీసుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడం సరికాదన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లొకేషన్ వల్ల రవాణా ఛార్జీల భారం ఎక్కువ ఉంటుందని, పర్యావరణ అంశాలను లెక్క చేయకుండా భద్రాద్రి నిర్మాణం ప్రారంభించారన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌తో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేదని, అప్పటి ప్రభుత్వం అలా చేయలేదన్నారు. 2016లో సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.

తప్పిదాలపై క్రిమినల్ చర్యలకూ వెనుకాడవద్దు:ప్రొఫెసర్ కోదండరాం

గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదని, గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81వేల కోట్ల అప్పులయ్యాయన్నారు. భవిష్యత్‌లో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాది ప్లాంట్‌ను కాపాడుకోగలమా అని ప్రశ్నించారు. గత ఏడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడవద్దని కోదండరాం కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics