Tuesday, April 22, 2025

Idol politics విగ్రహ రాజకీయం… పెరిగిన మాటల యుద్ధం

  • మీకు బలుపు తగ్గలేదు: సీఎం రేవంత్​
  • నా మాటలు గుర్తు పెట్టుకో రేవంత్: కేటీఆర్‌

అధికార కాంగ్రెస్​, విపక్ష బీఆర్​ఎస్​ మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం పెరిగింది. కీలక నేతలిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయంలో రాజీవ్​ గాంధీ విగ్రహం ఏర్పాటుపై వివాదం రచ్చకెక్కింది. తాజాగా సీఎం రేవంత్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత పెద్దదైంది. అధికారం పోయినా బీఆర్ఎస్‌ నేతలకు బలుపు తగ్గలేదని సీఎం రేవంత్ అన్నారు. సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తెలంగాణ సెక్రెటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే భవిష్యత్తులో కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టు కుందామనుకుంటున్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని చెప్పారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎ రేవంత్ సవాల్ చేశారు.

మీకు అధికారం ఇక కలనే..
అలాగే.. కేటీఆర్ నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నావ్.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే. ఇక మీరు చినతమడకకే పరిమితమంటూ కౌంటర్ వేశారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని, డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదని చెప్పారు. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని సీఎం రేవంత్ హెచ్చరించారు.

గుర్తు పెట్టుకో రేవంత్​: కేటీఆర్​
బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాదని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్​కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేస్తామని, అధికారంలోకి వచ్చాక సచివాలయం ఎదుట కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్‌ నా మాటలు గుర్తుంచుకోండని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చెత్త తొలిగిస్తామన్నారు. బీఆర్ఎస్ రాగానే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం.. ఢిల్లీ గులాంలు రాష్ట్ర ఆత్మగౌరవం అర్థం చేసుకుంటారని ఆశించలేం అని అన్నారు. చెత్తమాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోందని అన్నారు.

బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని చెప్పారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని, అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎం రేవంత్ సవాల్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com