Monday, May 19, 2025

పట్టభద్రుల వెనకడుగు అభ్యర్థుల్లో ఆయోమయం

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో పట్టభద్రులు ఓటేసేందుకు వెనకడుగు వేశారు. పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోంది. తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం ? … విద్యావంతులు ఎవరికి పట్టం కట్టారనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలను తలపించేలా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు మినహా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే మునుపటి ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఉప ఎన్నికలో పోలింగ్ పర్సంటేజ్‌ తగ్గింది.

2021లో పట్టభద్రుల ఎన్నికలు జరగగా 5, 05, 565 ఓటర్లకు గాను 3, 87, 989 మంది గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు 76.73శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 72.37 పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12, 806 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అయితే, ఈ ఉప ఎన్నికల్లో కొత్తగా మళ్లీ పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో లాస్ట్ టైం కంటే తక్కువ మంది 4, 63, 839 మంది నమోదు చేసుకున్నారు. అటు పోలింగ్ విషయంలో చేతులెత్తేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల బిజీలో పడ్డ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోలేదు.

ఏమవుతుందో..?

గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ పర్సంటేజ్‌ తగ్గడం కొందరి అభ్యర్థులను కలవర పెడుతుంటే.. మరికొందరిలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. నమోదైన పోలింగ్ పై అభ్యర్థులు ఎవరిపాటికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన క్షణం నుంచి పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లే తరలివచ్చి ఓటు హక్కు సద్వినియం చేసుకున్నారని, ఆ ఓటు కచ్చితంగా తన విజయానికి దోహదపడుతుందని బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసంతో విద్యావంతులు తనను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే శాసన మండలకి పంపుతారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

అటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా గెలుపు విశ్వాసంతో ఉన్నారు. తనలాంటి విద్యావంతుని ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపడం కోసం విద్యావంతులంతా కంకణం కట్టుకున్నారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే తనకు పట్టం కడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక, ప్రభుత్వ అనుకూల ఓట్లే దాదాపుగా నమోదయాయని అవి తన విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. ఓటర్లు తనకు మద్దతుగా నిలిచారని కాన్ఫడెన్స్ వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com