సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.రాష్ట్రాల వారీగా ఏపీ (25 MP సీట్లు), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్య ప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్ము కశ్మీర్ (1) లో 4వ విడతలో పోలింగ్ జరుగుతుంది.ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.