Tuesday, April 22, 2025

పొంగల్‌కి కాదు సమ్మర్‌కి

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా రెండో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ హీరోగా తారక్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వార్ 2 సినిమా పూర్తి చేయడంతో పాటుగా నీల్ సినిమా షూటింగ్ కి కూడా సన్నద్ధం అయ్యాడు ఎన్టీఆర్. మైత్రి నిర్మాతలు నీల్ ఎన్టీఆర్ సినిమా మీద భారీ హైప్ ఎక్కిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ నీల్ మరో యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలు పెడతారని టాక్. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ముందే 2026 సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మే వచ్చేసింది ఇప్పటివరకు నీల్ ఎన్టీఆర్ సినిమా ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి అయ్యింది. మరి మిగతా 7 నెలల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడం కుదరని పని. అందుకే సినిమా సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్ సినిమాలు ఓపెనింగ్ టైమ్ లో ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. కానీ షూటింగ్ అనుకున్న టైమ్ కి పూర్తి అవ్వక అనుకోని అవంతరాలు ఎదురై అనుకున్న డేట్ వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. స్టార్ సినిమా వస్తుంది కదా అని మిగతా సినిమాలు ఏవి ఆ డేట్ కి వచ్చే డేర్ చేయలేరు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com