Friday, September 20, 2024

Ponguleti Bank Scam: పొంగులేటి భారీ కుంభకోణం

  • రూ.4500 కోట్ల స్కామ్!
  • ఫేక్​ గ్యారంటీలతో మోసం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌.. ఏపీఎస్పీడీసీఎల్​ నుంచి రూ.2,451 కోట్లు, ఏపీఈపీడీసీఎల్​ నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందుకోసం ఆయన ఫేక్ గ్యారెంటీలు సమర్పించారన్న విషయం బయటకు వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఫేక్‌ గ్యారెంటీల కుంభకోణం సంచలనంగా మారింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు తీగ లాగితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడా కాంట్రక్టర్ల డొంక కదులుతోంది. దీంతో పొంగులోటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొంగులేటి వేల కోట్లల్లో మోసం చేశారనే అనుమానాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి . ఏపీఎస్​పీడీసీఎల్​తో పాటు ఏపీఈపీడీసీఎల్​తోనూ పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఒప్పందం చేసుకుంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు ఎస్పీడీసీఎల్​ నుంచి రూ.2,451 కోట్లు, అలాగే ఈపీడీసీఎల్​ నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. మొత్తంగా వీటి విలువ రూ.4,500 కోట్లు.

ఇప్పటికే ఈ రెండు సంస్థల నుంచి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.217 కోట్లు అడ్వాన్సు కూడా తీసుకుంది. ఎస్పీడీసీఎల్​ నుంచి రూ.115 కోట్లు, అలాగే ఈపీడీసీఎల్​ నుంచి రూ.102 కోట్లు వచ్చాయి. అయితే ఈ మొత్తం కాంట్రాక్టుకు పొంగులేటి ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీ గడువు ముగిసిందని సదరు సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు లేఖ కూడా రాసింది. దేశంతో సంబంధం లేని బ్యాంకు ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. కేవలం రూ.8 కోట్ల విలువైన యూరో ఎగ్జిమ్ బ్యాంకు.. రూ.వేల కోట్ల గ్యారెంటీలు ఇవ్వడం వెనుక వేల కోట్ల స్కామ్‌ జరిగింది.

మేఘా లాంటి బడా కాంట్రక్టు సైతం ఈ కుంభకోణంలో భాగమే. దొంగ బ్యాంకు గ్యారెంటీలతో వేల కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలు నొక్కేస్తున్నాయి. ఈ మొత్తం కుంభ కోణంలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే ఈ దొంగ బ్యాంకు గ్యారెంటీల వ్యవహారాన్ని పరిశీలించాలని సీబీఐకి ఆర్బీఐ లేఖ రాసిన సంగతి తెలిసిందే. యూరో ఎగ్జిమ్ బ్యాంకు వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐలకు లేఖ రాశారు.

పొంగులేటి సైలెంట్​
ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పొంగులేటి ఇప్పటి వరకూ స్పందించలేదు. ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం ఇప్పుడు చర్చగా మారింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు ఎస్పీడీసీఎల్​ నుంచి రూ.2,451 కోట్లు, అలాగే ఈపీడీసీఎల్​ నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కగా..

మొత్తంగా వీటి విలువ రూ.4,500 కోట్లు ఉండటంతో పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.217 కోట్లు అడ్వాన్సు కూడా తీసుకుంది. కేవలం రూ.8 కోట్ల విలువైన యూరో ఎగ్జిమ్ బ్యాంకు.. రూ.వేల కోట్ల గ్యారెంటీలు ఇవ్వడం వందలు/వేల కోట్ల స్కామ్‌ జరిగినట్లు తెలుస్తోంది. మేఘా లాంటి బడా కాంట్రక్టు సైతం ఈ కుంభకోణంలో భాగమే. దొంగ బ్యాంకు గ్యారెంటీలతో వేల కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలు నొక్కేస్తున్న వ్యవహారం చర్చగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular