Sunday, March 16, 2025

పదోన్నతల ఉత్తర్వులు జారీ – మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలపిన అధికారులు

రవాణా శాఖ లో డి టి సి లను జే టి సి లు గా, ఆర్టీవో లను డి టి సి లు గా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ లో పెండింగ్ లో ఉన్న పదోన్నతులు కల్పించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పదోన్నతులు పొందిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, శివ లింగయ్య డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్, వాణి,సదానందం,కిషన్, సురేష్ రెడ్డి లు ఈ రోజు హైదరాబాద్ లో మంత్రి గారి నివాసం లో మంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవ వల్లనే ఈ పదోన్నతులు సాధ్యమయ్యాయని వారు తెలిపారు. ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ కుమార్, తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ వాహనదారులకు మెరుగైన సేవలు అందించడం ,ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం తో పాటు రహదారి భద్రత ను పెంపొందించడానికి కృషి చేయాలని పదోన్నతి పొందిన అధికారులకు మార్గ నిర్దేశనం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com