Monday, November 18, 2024

శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా కెసిఆర్ పంట పొలాల సందర్శనకు బయలుదేరారు

  • శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా
  • కెసిఆర్ పంట పొలాల సందర్శనకు బయలుదేరారు
  • రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్

గీతన్న.. నేతన్నా.. వేరు కాదు, మీకు అండగా ఉక్కు కవచంలా ఉండే బాధ్యత నాది అని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పంట పొలాల సందర్శనకు బయలుదేరారని ఆయన అన్నారు. శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యత తో పంట పొలాలు తిరుగుతున్న మీకు మా ప్రభుత్వం తరఫున పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని మంత్రి పొన్నం తెలిపారు. ప్రాజెక్టులపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్న రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మీరు అధికారం నుంచి దిగేనాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి నిల్వలపై చర్చిద్దామన్నారు. ఈరోజు తాగు, సాగు నీటికి వాటిని ఎలా వాడమో స్పష్టంగా చెప్పడానికి , చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కరువు కాంగ్రెస్ తెచ్చిందని మీరు ఇలా అర్ధం లేకుండా మాట్లాడడం సరికాదని ఆయన హితవు పలికారు. కరువుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కారణం కాదన్నారు. మీరు రాజకీయంగా నిజంగా బిజెపితో లేనట్లయితే, తెలంగాణ ప్రయోజనాలు రైతుల ప్రయోజనాలను కాపాడినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, మీరు మాతో కలిసి రావాలని మంత్రి పొన్నం సూచించారు.

బిజెపి వాళ్లు ఏదీ పడితే అది మాట్లాడుతున్నారు…

ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడిగిన అనేక సంఘటనల గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కలిసి రావాలని మంత్రి పొన్నం సూచించారు. బిజెపి ఎంపి ఏదీ పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నారని, మీరు కూడా రండి దీక్ష గల్లీలో కాదు ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గర చేద్దామని మంత్రి పొన్నం బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు, తెలంగాణ రైతన్నను ఆదుకునే ప్రయత్నం చేయలేదని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యలేదు, మీరు ఎప్పుడూ అడగలేదని బిజెపి నాయకులపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంతో కొట్లాడే ఆలోచన మాకు లేదు

కేంద్రంతో కొట్లాడే ఆలోచన మాకు లేదని, తమకు ఎటువంటి భేషాజాలు లేదని, కేంద్రం సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం తెలిపారు. మధ్యవర్తిగా అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా మీరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మిగతా నాయకత్వం ముందుకు రావాలన్నారు. కెసిఆర్ పర్యటన చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశాన్ని ఇస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. మీరు పొలాల్లోకి వెళ్లి అక్కడ, ఇక్కడ ఎండిపోయిన వాటిని కోసుకొచ్చి రోడ్లమీద వేయడం తగదన్నారు. రైతులను ఆదుకునే ఆలోచన ఉంటే కేంద్రం దగ్గరకు వెళ్దాం, కేంద్రంతో కొట్లాడి ప్రకృతి వైపరీత్యం కింద కరువుకు సంబంధించి నిధులు తెచ్చుకుందాం, అందుకు సహకరించాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. మాజీమంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ నేతన్నల మీద కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత కక్ష అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.

గతంలో బతుకమ్మ చీరల పెండింగ్ పైసలు ఇయ్యలేదు

మీరు గతంలో బతుకమ్మ చీరల పెండింగ్ పైసలు ఇయ్యలేదని మంత్రి పొన్నం ఆరోపించారు. కార్మికులకు 24 గంటలు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టం చేస్తూ రాష్ట్రంలో అవసరమున్న ప్రతి బట్టను నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. రాజకీయ చట్రంలో నేతన్నలు పడొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. పాత బకాయిలు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం ప్రతి పేమెంట్‌ను చేస్తుందన్నారు. బతుకమ్మ చీరల పేరు మీద కొంత మంది బినామీలకు మాత్రమే లబ్ధి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయ్, బతుకమ్మ చీరల కంటే ఎక్కువగా కార్మికునికి ,యజమానికి పని ఉండే విధంగా కాపాడే బాధ్యత మాదన్నారు. మూడు నెలల్లో తాము మొత్తం వస్త్ర పరిశ్రమ ముంచేసినట్టు మాట్లాడితే మీకు తగదన్నారు. మీకు ఏమైనా బాధ్యత గల సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ జిల్లా మంత్రిగా మీకు సహకరించడానికి తాను ఉన్నానని ఆయన తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular