Wednesday, December 25, 2024

పూజా అదృష్టం ఎలా ఉంటుందో?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న పూజా హెగ్డే ఇటీవల కాస్త వరుస ఫ్లాప్స్ తో స్పీడ్ తగ్గించింది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అమ్మడు ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో కమర్షియల్ బ్రేక్ అందుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అలాగే సక్సెస్ లు కూడా సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా పూజా హెగ్డే మారిపోయింది. 2021లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ వరకు ఆమెని ఆపేవారే లేరు. అయితే తరువాత పూజా హెగ్డే కెరియర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. పూజా హెగ్డే మొదటి సినిమాని తమిళంలోనే చేసింది. జీవాకి జోడిగా ‘ముగన్ మూడి’ సినిమాలో నటించింది. మరల 10 ఏళ్ళ 2022లో ‘బీస్ట్’ చిత్రంలో దళపతి విజయ్ కి జోడీగా తమిళంలో ఆమె రెండో సినిమా చేసింది. ఈ మూవీ ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. దానికంటే ముందుగా తెలుగులో ప్రభాస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ తో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సొంతం చేసుకుంది. తరువాత వచ్చిన ‘ఆచార్య’ డిజాస్టర్ అయ్యింది. హిందీలో రణవీర్ సింగ్ కి జోడీగా చేసిన ‘సర్కస్’, అలాగే సల్మాన్ కి జోడీగా చేసిన ‘కిసికా భాయ్ కిసీకి జాన్’ సినిమాలు కూడా కూడా డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాలతో ఆమె కెరియర్ కూడా ఒక్కసారిగా క్రిందికి పడిపోయింది. 2024లో పూజా హెగ్డే నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్స్ లోకి రాలేదు. ‘రాధేశ్యామ్’ తో పాన్ ఇండియా స్టార్ ని అయిపోతానని అనుకున్న పూజా హెగ్డేని ఆ మూవీ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక పూజా హెగ్డే కెరియర్ అయిపోయినట్లే అని అందరూ భావించారు. అనూహ్యంగా ఆమెకి కోలీవుడ్ ఇండస్ట్రీ భరోసా ఇచ్చింది. సూర్య హీరోగా తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా అవకాశం సొంతంచేసుకుంది. ఇళయదళపతి విజయ్ 69వ మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే హిందీలో షాహిద్ కపూర్ కి జోడీగా ‘దేవ’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు మరో రెండు తమిళ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చర్చలు జరుపుతోంది. ఇక మరల తన కెరియర్ ట్రాక్ లో పడుతుందని ఈ బ్యూటీ బలంగా నమ్ముతోంది. ఎక్కువగా విజయ్ ఆఖరి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి గ్యాప్ రాకుండా కాస్త పట్టు సాధించింది. మరి ఈ లైనప్ అమ్మడికి ఎలాంటి క్రేజ్ ను తెస్తుందో చూడాలి. సూర్యతో చేసే సినిమా హిట్‌ అయితే అమ్మడు మళ్ళీ లైన్‌లో పడ్డట్టే.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com