ఎంతటి శక్తివంతులైన వదలొద్దు
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించారు. విద్యార్థినులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా లేఖ రాసింది. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలు, నమ్మకంతో బయటకు పంపుతున్నారని.. బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి బాధపడుతున్నానని తెలిపింది. ఇటీవల మీకు జరిగిన పరిస్థితి దారుణమని.. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితో నిజానిజాలు బయటకు వస్తాయని తాను చెప్పాలనుకుంటున్నానన్నారు. చట్టం బలహీనులకు బలంగా, బలవంతులకు బలహీనంగా వర్తించబడుతుందనే నానుడి మనదేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనల్లో గుర్తుకు తెచ్చాయన్నాయని పేర్కొన్నారు.
‘నిందితులు ఎలా రక్షించబడతారు.. బాధితులు ఎలా అవామీ.. ఎలా అవమానించబడతారు’ అనేది తనకు బాగా అనుభవమని.. ఇలాంటి చర్యలతో తాను మానసికంగా అలసిపోయాయని చెప్పింది. కాలేజీలు డిగ్రీ సర్టిఫికెట్లను రద్దు చేసి స్టూడెంట్స్‌ని బయటకు పంపిన సంఘటనలు అనేకం ఇక్కడ ఉన్నాయని.. వ్యక్తులు ఎంత శక్తివంతమైన వారైనా.. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. ఏ పార్టీకి చెందిన వారైనా వదలొద్దని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా రెజ్లర్ల నిరసనను మాత్రమే తాను గుర్తు చేయగలనని చెప్పారు. ఇక్కడ యువతులు తమ కోసం కాకుండా ఇతరుల కోసం సైతం పోరాడుతున్నారన్నారు. ఓ అమ్మాయి.. ఎంతోమంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం తనకు అసహ్యాన్ని కలిగించిందని.. నిందితులు ఎంతటి శక్తివంతులు సహకరిస్తూన్నా ఎవరినీ వదిలిపెట్టొద్దని.. తప్పనిసరిగా వారి గుణపాఠం చెప్పాలని సూచించారు.
సలహాలు ఇవ్వడం సులువే కానీ దాన్ని అమలు చేయడం కష్టమని తనకు తెలుసునని.. ఈ మాటలు తాను మనస్ఫూర్తిగా చెబుతున్నానని.. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల వారికి ఎంతో బలాన్ని ఇస్తుందన్నారు. కూతురిగా, చెల్లిగా మీరు చూడాలనుకుంటున్న మార్పు కోసం పోరాడండి అంటూ పూనమ్ కౌర్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని వాష్‌రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టారని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారం రేపింది. ఈ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్‌లో ఉన్నది. ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.