- నాసిరకంగా వివాహ భోజనంబు రెస్టారెంట్ ఫుడ్
- రెస్టారెంట్‌కు నోటీసులు
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో గల రెస్టారెంట్‌ను అధికారులు నిశీతంగా పరిశీలించారు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన 25 కేజీల చిట్టిముత్యాల బియ్యం, నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రీజ్‌లో పెట్టడాన్ని గుర్తించారు. ఆహారం తయారు చేసేందుకు వాడుతున్న నీటిని పరిశీలించారు. కిచెన్‌లో పరిశుభ్రత పాటించలేదని, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను గుర్తించారు.
తయారు చేసిన ఫుడ్ ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఉంచడం చూసి షాకయ్యారు. ఫుడ్ ప్రిపేర్ చేసే వారి హెల్త్‌కు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ లేవని తెలిపారు. వంట పాత్రలు క్లీన్ చేసిన నీరు అక్కడే నిల్వ ఉండడం చూసి నిర్వాహకులను అడిగారు. భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు నోటీసులు ఇచ్చారు. వివాహ భోజనంబు రెస్టారెంట్ వివరాలు, అక్కడ ఉపయోగించే ఆహార వివరాలను సోషల్ మీడియా ఎక్స్‌లో జీహెచ్ఎంసీ అధికారులు పోస్ట్ చేశారు.