Monday, May 5, 2025

పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. దేవుని ఆలింగనంలో ఆయన ఆత్మకు శాశ్వత శాంతి లభిస్తుందని పేర్కొన్నారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలత పెట్టిందన్నారు. భారత ప్రజలపై పోప్ ఫ్రాన్సిస్ ప్రేమాభిమానాలు నిత్యం నిలిచి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాథలిక్ సమాజానికి ఈ సందర్భంగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. అలాగే చిన్ననాటి నుంచి క్రీస్తు ఆదర్శాలను పోప్ ఫ్రాన్సిస్.. తనను తాను అంకితం చేసుకున్నారని వివరించారు. పేదలు, అణగారిన ప్రజలకు ఆయన సేవలందించారని గుర్తు చేశారు. దేవుని ఆలింగనంలో ఆయన ఆత్మకు శాశ్వత శాంతి లభిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది కాథలిక్కులు.. పోప్ ఫ్రాన్సిస్‌ను ఆరాధిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశం వేదికగా పోప్‌ను ప్రధాని మోదీ కలిసి సంగతి తెలిసిందే. అలాగే పోప్‌ ఫ్రాన్సిస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అయితే కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) 2022లో పోప్‌ను భారత్‌కు ఆహ్వానించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రధాని మోదీని సంప్రదించింది. వీలైనంత త్వరగా అందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యం కారణంగా.. ఆయన దేశానికి రాలేకపోయారని సీబీసీఐ అధ్యక్షుడు మార్ ఆండ్రూస్ తఝుత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com