Thursday, February 27, 2025

పోసాని అరెస్ట్‌

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం మై హోం భుజా అపార్టుమెంటులో ఉంటున్న ఆయనను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారు.
పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాయదుర్గం చేరుకొని పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతనిని అతికష్టంమీద అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు ఒంటి మీద షర్టు కూడా లేకుండా ఈడ్చుకెళ్ళారని సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com