Wednesday, May 14, 2025

పోసానికి కోర్ట్‌ కండీషన్స్‌

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పోసానికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది.
పోసానికి కోర్టు విధించిన షరతులు ఇవే:
రూ. 2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి.
జైలు నుంచి విడుదలైన తర్వాత దేశం విడిచి వెళ్లరాదు.
కేసు గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాతో కూడా మాట్లాడకూడదు.
పత్రికలకు ప్రకటనలు ఇవ్వరాదు.
నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలి.
కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com